News May 24, 2024
ప.గో: సప్లిమెంటరీ పరీక్షలు.. 30ని ముందే అనుమతి

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లాలో ఈ పరీక్షలకు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇంటర్-8,664 మందికి ఉ.9గంటల నుంచి మ.12 వరకు, సెకండ్ ఇంటర్-4,133 మందికి మ.2:30 నుంచి సా.5: 30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 30 నిమిషాల ముందే కేంద్రంలోకి అనుమతి ఇస్తామన్నారు. ఫిర్యాదులుంటే 08812 230197కు ఫోన్ చేయాలన్నారు.
Similar News
News December 24, 2025
ప.గో: నేడు స్వగ్రామానికి జవాన్ రాజశేఖర్ భౌతికకాయం

విధి నిర్వహణలో మరణించిన పెనుమంట్ర(M) పొలమూరుకు చెందిన జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు బుధవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో ఉదయం 10 గంటలకు వడలి, పెనుగొండ, మార్టేరు మీదుగా భారీ ర్యాలీతో స్వగ్రామానికి తీసుకురానున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర జవాన్‌కు తుది నివాళి అర్పించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.
News December 24, 2025
ప.గో: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. UPDATE

పెనుమంట్ర మండలం పొలమూరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం స్పందించారు. ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన ఘటనపై పోలీసు, రవాణా, ఆర్అండ్బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ జరపాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి త్వరగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
News December 24, 2025
ప.గో: అకౌంట్లో నుంచి రూ.90 వేలు కట్.. ఎలాగో తెలిస్తే షాక్!

వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన ఓ వ్యక్తి రూ.90 వేలు పోగొట్టుకున్నారు. ఉమ్మడి ప.గో జిల్లా ఏలూరులోని దక్షిణపు వీధికి చెందిన సత్యనారాయణకు ఈనెల 17న ‘ఎం-పరివాహన్’ పేరుతో మెసేజ్ రాగా, దాన్ని ఓపెన్ చేయగానే ఖాతా నుంచి నగదు మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏలూరు వన్‌టౌన్ ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


