News April 19, 2024

ప.గో.: సెంటిమెంట్.. ఇక్కడికెళ్తే ఎన్నికల్లో గెలుపు పక్కా

image

ఎన్నిక ఏదైనా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే నాయకులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ప్రచారం ప్రారంభించేందుకు ముందు నాయకులు మండలంలోని నందమూరులో కొలువైన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని విశ్వాసం. మాజీ CM జలగం వెంగళరావు గతంలో ఏడాదికి ఒకసారైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
– మీ ప్రాంతాల్లో ఇలా ఏదైనా సెంటిమెంట్ ఉందా..?

Similar News

News October 14, 2025

ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

image

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజా‌బాబు (9705649492) కి తెలపాలని జీఆర్‌పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2025

భీమవరం: అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

image

ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ నాగరాణి పీజీఆర్‌ఎస్‌లో దేవాదాయ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో దేవాలయాలు శోభాయమానంగా ఉండేలా సిద్ధం చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పేరుపాలెం బీచ్‌ వద్ద సముద్ర స్నానాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News October 13, 2025

భీమవరం: నేటి పీజీఆర్ఎస్‌కు 95 అర్జీలు

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 95 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.