News April 19, 2024
ప.గో.: సెంటిమెంట్.. ఇక్కడికెళ్తే ఎన్నికల్లో గెలుపు పక్కా
ఎన్నిక ఏదైనా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే నాయకులకు ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. ప్రచారం ప్రారంభించేందుకు ముందు నాయకులు మండలంలోని నందమూరులో కొలువైన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి ఆశీస్సులు ఉంటే విజయం తథ్యమని విశ్వాసం. మాజీ CM జలగం వెంగళరావు గతంలో ఏడాదికి ఒకసారైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు.
– మీ ప్రాంతాల్లో ఇలా ఏదైనా సెంటిమెంట్ ఉందా..?
Similar News
News September 18, 2024
ప.గో జిల్లాలో పొగాకు మళ్లీ ఆల్ టైం రికార్డ్ ధర
ఉమ్మడి జిల్లాలోని ఎన్‌ఎల్‌ఎస్ ఏరియా పరిధిలోని పొగాకు ధర రికార్డు బద్దలు కొట్టింది. మంగళవారం జంగారెడ్డిగూడెం-1, జంగారెడ్డిగూడెం-2, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో అత్యధికంగా రూ.408 నమోదయ్యింది. దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.400, గోపాలపురంలో రూ.399 ధర పలికింది. మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 6,669 బేళ్లు రైతులు అమ్మకానికి తీసుకురాగా, వీటిలో 4,444 బేళ్లు అమ్ముడైనట్లు రైతులు పేర్కొన్నారు.
News September 18, 2024
ఏలూరు: లాయర్ మృతి.. ఫ్యామిలీ పైనే కేసు
ఏలూరుకు చెందిన లాయర్ కార్తీక్ గత నెల మృతి చెందిన విషయం తెలిసిందే. ఏలూరు 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. కార్తీక్ HYDలో వేరే కులానికి చెందిన మనీషాను 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. భార్య తరఫువాళ్లు కుల వివక్ష చూపేవారు. 2023లో భార్య పుట్టింటికి వెళ్లిపోయి, తన వారితో కేసులు పెట్టించడంతో మనోవేదనకు గురై మృతి చెందారు. మృతుని తండ్రి ఫిర్యాదుతో అతని భార్య, మరో ఐదుగురిపై కేసు నమోదైనట్లు తెలిపారు.
News September 18, 2024
మంత్రి లోకేష్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గన్ని
ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మంత్రి నారా లోకేష్‌ను ఉండవల్లిలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి చర్చించారు. ఆయన వెంట పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి శ్రీనివాసులు, నాయకులు తోట సీతారామలక్ష్మి, వలవల బాబ్జి, మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.