News September 7, 2024
ప.గో.: స్కూటీ డిక్కీలో పాము (PHOTO)
పెనుమంట్ర మండలం మార్టేరులో శుక్రవారం రాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీలోకి జెర్రిపోతు జాతికి చెందిన పెద్దపాము చొరబడింది. వివరాలు.. గ్రామానికి చెందిన మహమ్మద్ బాషాకి చెందిన స్కూటీలోకి పాము ప్రవేశించినట్లు ఆయన కుమారుడు యూసుఫ్ గమనించాడు. దీంతో స్కూటీ ముందుభాగాన్ని తొలగించగా పాము వెళ్లిపోయింది. వర్షాకాలం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News October 9, 2024
పెదవేగి: ముగ్గురి ప్రాణం తీసిన పందెంకోడి
పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో తండ్రి, ఇద్దరు కుమారులు <<14312151>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
News October 9, 2024
ఏలూరు: పోలవరం కుడి కాలువలో పడి ముగ్గురు మృతి
పెద్దవేగి మండలం కవ్వగుంటలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం కుడి కాలువలో పడి తండ్రి, ఇద్దరు కుమారులు మృతి చెందారు. మృతులు వెంకటేశ్వరరావు (50), మణికంఠ(16), సాయికుమార్ (13)గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 9, 2024
ప.గో. జిల్లాలో 2,658 దరఖాస్తులు
ప.గో.జిల్లాలో 175 మద్యం దుకాణాలకు మంగళవారం సాయంత్రానికి 2,658 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తులు అత్యధికంగా వస్తున్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈనెల 11 వరకు టెండర్ల ప్రక్రియకు సంబంధించి గడువు పొడిగించడం జరిగిందన్నారు. 14న లాటరీ విధానం ద్వారా దుకాణాల కేటాయింపు, 16న షాపులు ప్రారంభించేలా చర్యలు చేపడతామన్నారు.