News November 19, 2024

ప.గో: స్పీకర్ స్థానంలో ఉంటూ మంత్రికి RRR విజ్ఞప్తి

image

ఆక్వారంగం అభివృద్ధిపై దృష్టి సారించామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలో తెలిపారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌లకు కరెంట్ ఛార్జీలపై రూ.1.50 సబ్సిడీ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. కాగా ఇదే సమస్యపై స్పీకర్‌గా ఉన్న రఘరామ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ‘ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఉభయ గోదావరి జిల్లాలు APకి ఆర్థికంగా కీలకం. ఈ సమస్యపై దృష్టి సారించాలని జిల్లా MLAగా కోరుతున్నా’ అని ఆయన అన్నారు.

Similar News

News October 20, 2025

భీమవరం: నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 20వ తేదీ (సోమవారం) జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం దీపావళి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ కోరారు.

News October 20, 2025

పాలకోడేరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

image

పాలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

News October 19, 2025

పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం

image

పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గోదావరి నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. పెనుగొండ ఎస్ఐ కె. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ మృతదేహాన్ని నదిలో గుర్తించారు. సిద్ధాంతం వీఆర్‌వో నాగేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.