News May 11, 2024
ప.గో.: 13న పరీక్ష.. 22 రోజులకు రిజల్ట్.. జాబ్ కొట్టేదెవరో?

రాజకీయ నాయకుడి జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నేటితో ముగిసిన నెల రోజుల ప్రచారం ప్రిపరేషన్ అన్నమాట. ఇక నేతలందరికీ 13న పరీక్ష(ఓటింగ్). 22 రోజులకే ఫలితాలు. ఉమ్మడి ప.గో.లో 15 జాబ్స్ (MLA స్థానాలు) ఉండగా.. మొత్తం 181 మంది (నామినేషన్లు) పరీక్ష రాశారు. వీరిలో టాప్ ర్యాంక్‌తో జాబ్ కొట్టేవారు ఎవరెవరో కామెంట్ చేయండి.
Similar News
News February 14, 2025
ప.గో : నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.
News February 14, 2025
యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.
News February 14, 2025
ఏలూరులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

ఏలూరులో ఈనెల 11న టూటౌన్ సీఐ వైవీ రమణ ఎన్ ఆర్ పేటలోని ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఎస్ఎస్ బ్యూటీ యునిసెక్స్ బ్యూటీ పార్లర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులు నాగార్జున, అతని భార్య శివదుర్గ, దివ్య, భాను ప్రకాశ్, నరేంద్రపై కేసు నమోదు చేశారు. నాగార్జున, శివదుర్గ, దివ్యలను కోర్టులో హాజరుపరచగా..14 రోజులు రిమాండ్ విధించారు. భాను ప్రకాశ్, నరేంద్ర పరారీలో ఉన్నారు.