News March 28, 2025
ప.గో: 15 ఉపసర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపసర్పంచ్‌ల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 15 ఉప సర్పంచుల స్థానాల్లో ఆయా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మరోవైపు పదవీకాలం కేవలం 9 నెలలు మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.
Similar News
News November 28, 2025
బాధితులకు రూ.1.85 కోట్లు అందజేత: కలెక్టర్

జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడుల కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం జరిగిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో డిసెంబర్ 24 నుంచి మే 25 వరకు బాధితులకు రూ.1.85 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. అట్రాసిటీ కేసులలో ఎఫ్ఐఆర్, చార్జిషీట్ నమోదులో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
భీమవరంలో మాక్ అసెంబ్లీ

మాక్ అసెంబ్లీ నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని హెచ్.ఎం. కె. కృష్ణకుమారి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ఝాన్సీలక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థినులు గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాజ్యాంగం తయారు చేయడానికి ముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే స్కిట్‌ను కూడా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించారు.
News November 27, 2025
కంబోడియా సూత్రధారి.. ప.గోలో 13 మంది అరెస్టు

భీమవరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ నుంచి రూ.78 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. కంబోడియాకు చెందిన ప్రధాన సూత్రధారి రహేత్ జె నయన్ సహకారంతో.. ‘కార్డ్ డీల్’ పద్ధతిలో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 13 మందిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


