News July 8, 2025

ప.గో: 1,612 సెల్‌ఫోన్‌ల రికవరీ: ఎస్పీ

image

ప.గో జిల్లావ్యాప్తంగా వివిధ విడతల్లో ఇప్పటివరకు సుమారు రూ.2.40 కోట్ల విలువైన మొత్తం 1,612 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పదవ విడతలో భాగంగా సుమారు రూ.31 లక్షల విలువైన 208 మొబైల్ ఫోన్‌లను బాధితులకు తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Similar News

News August 31, 2025

గణపవరం మండలం ప.గోలోనే కొనసాగుతుంది: కేంద్రమంత్రి హామీ

image

ప.గో జిల్లాలోనే గణపవరం మండలం కొనసాగుతుందని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఆదివారం గణపవరం మండలానికి చెందిన వివిధ వ్యాపార సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలోని కేంద్రమంత్రి నివాసం వద్ద వర్మను కలిసి మాట్లాడారు. ఈ మేరకు వారందరికీ ఆయన హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండలాన్ని వేరే జిల్లాలోకి మారుస్తారనే ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు.

News August 31, 2025

స్నేహపూర్వక వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్, పీస్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా పేరు ఉందని, ఇకముందు కూడా ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ పర్వదినాలను కుల, మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు.

News August 31, 2025

లింగ నిర్ధారణకు పరీక్షలు చేస్తే చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

image

లింగ నిర్ధారణ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన మల్టీమెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.