News August 18, 2024
ప.గో.: 27న జడ్పీ సర్వసభ్య సమావేశం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందని సీఈవో సుబ్బారావు తెలిపారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో స్థాయీసంఘాల ఎన్నిక కార్యక్రమం, జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందన్నారు.
Similar News
News November 3, 2025
నరసాపురం: భారీ దొంగతనం కేసులో చేధించిన పోలీసులు

నరసాపురం(M) తూర్పుతాళ్లులో గతేడాది సెప్టెంబర్‌లో బంగారు షాపులో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. సోమవారం ఎస్పీ నయీమ్ అస్మి తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనానికి పాల్పడిన వారిలో నలుగురిని ఇవాళ అరెస్టు చేశారు. ఇదే కేసులో దొంగ బంగారం కొన్నట్లు తేలడంతో ముగ్గురు గోల్డ్ షాప్ యాజమానులపైనా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 666గ్రా బంగారం, 2,638 గ్రాముల వెండి, నాలుగు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.
News November 3, 2025
భీమవరం: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) యథావిధిగా జరుగుతుందని ఆమె చెప్పారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


