News August 18, 2024

ప.గో.: 27న జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరుగుతుందని సీఈవో సుబ్బారావు తెలిపారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో స్థాయీసంఘాల ఎన్నిక కార్యక్రమం, జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందన్నారు.

Similar News

News September 8, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు నాగమణి, అబ్రహం తెలియజేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప.గో, ఏలూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పాఠశాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. SHARE IT..

News September 8, 2024

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా భీమవరం MLA తనయుడు

image

భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తనయుడు పులపర్తి ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ప్రశాంత్‌ని నియోజకవర్గంలో పలువురు అభినందించారు.

News September 8, 2024

ప.గో.: అశ్లీల నృత్యాలు.. 8 మంది అరెస్ట్

image

ఉండి మండలం పెదపులేరులో గత నెల 15న వారాల పండగను పురస్కరించుకొని కొంతమంది వ్యక్తులు స్థానిక శ్మశానవాటిక సమీపంలో అశ్లీల నృత్యాలు చేసినట్లు వీఆర్వో పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఉండి ఎస్ఐ మహమ్మద్ నజీరుల్లా తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.