News June 4, 2024
ప.గో.: 50 వేల మెజారిటీ దిశగా RRR

ఉండి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా.. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. కాగా కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు 81931 ఓట్లు సాధించి 39390 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకు 42541 ఓట్లు వచ్చాయి.
Similar News
News October 25, 2025
తణుకు డిపో నుంచి ప్రత్యేక బస్సులు: DM

కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుంచి రాష్ట్రంలోని పలు పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తణుకు RTC డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ శుక్రవారం తెలిపారు. పంచారామాలకు అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీలలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. కార్తీక సోమవారం దర్శనాల అనంతరం తిరిగి తణుకు చేరుతాయని చెప్పారు.
News October 25, 2025
డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం

డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు డీఎన్ఆర్ డిగ్రీ ప్రిన్సిపల్ జి.మోజెస్ శుక్రవారం తెలిపారు. 2001-20 మధ్య కాలంలో డిగ్రీ ఫెయిలైన అభ్యర్థులకు యూనివర్సిటీ మరో అవకాశం కల్పించిందన్నారు. పరీక్ష ఫీజు కట్టి, డిగ్రీ పూర్తి చేయడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 24, 2025
నర్సాపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నర్సాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నరసాపురం ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నరసాపురం పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.


