News May 26, 2024
ప.గో: ALERT.. కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వ్యాపారులు హానికర రంగులు, కెమికల్స్‌తో కూల్ డ్రింక్స్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెంలోని రామన్నగూడెం, మండవల్లిలోని లోకుమూడి, పాలకొల్లులో ఈనెల 21-24 వరకు జరిగిన విజిలెన్స్ తనిఖీల్లో ఈ గుట్టురట్టయ్యింది. అనుమతులు లేకుండా కొందరు.. గడువు తీరిన, హానికర రసాయనాలతో డ్రింక్స్ తయారు చేస్తూ ఇంకొందరు సొమ్ము చేసుకుంటున్నారు.
Similar News
News February 18, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపై కేసు నమోదు: ఎస్సై

లారీ ఢీకొని విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని పెదతాడేపల్లిలో సోమవారం జరిగింది. ముత్యాలంబపురం గ్రామానికి చెందిన పప్పు సంజీవరావు(64) పొలం పనులు ముగించుకుని బైక్‌పై వస్తుండగా పెదతాడేపల్లి వద్ద వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
News February 17, 2025
యజమానులకు చెప్పకుండా సర్వే చేయవద్దు: JC

భూ యజమానులకు తెలియకుండా సర్వే చేయరాదని ప.గో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. ఎంతమంది రైతులకు నోటీసులు ఇచ్చారో తెలుసుకున్నారు. నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.
News February 17, 2025
ప.గో: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీనితో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.