News January 19, 2026
ప.గో: ALERT.. కోర్టులో JOBS

ఉమ్మడి ప.గో జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జడ్జి జస్టిస్ శ్రీదేవి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను ఏలూరు కోర్టుకు సమర్పించాలన్నారు. దరఖాస్తు నమూనా, నిబంధనల వివరాలను జిల్లా కోర్టు, కలెక్టరేట్, గ్రంథాలయం, ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News February 18, 2026
తల్లిదండ్రులకు కలెక్టర్ నాగరాణి కీలక సూచన.. ఏంటంటే?

విస్సాకోడేరు జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పౌష్టికాహారంపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే పిల్లలు పాఠశాలల్లోనే ఎందుకు భోజనం చేయాలో వారికి అర్థమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
News February 18, 2026
కలెక్టర్ గారే స్వయంగా వచ్చారు.. ఆగర్తిపాలెంలో మెగా ఈవెంట్!

పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం, లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగర్రు సొసైటీ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఆగర్రు సొసైటీ ఛైర్మన్ మేడిది జాన్ రాజు ఏర్పాట్లు పర్యవేక్షించగా, ఆర్డీఓ దాసి రాజు, ఏఎంసీ ఛైర్మన్ కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పశుపోషకులు తమ పశువులకు వైద్యం చేయించుకున్నారు.
News February 18, 2026
నరసాపురం: పెళ్లైన విషయం దాచి బాలికతో ప్రేమ.. చివరికి..!

నరసాపురం రుస్తుంబాదకు చెందిన వివాహితుడు కొవ్వెల కళ్యాణ్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు తరలించినట్లు DSP డా.శ్రీవేద తెలిపారు. నరసాపురం టౌన్ SI సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.


