News May 25, 2024

ప.గో: ALERT.. చలామణిలో భారీగా నకిలీ నోట్లు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీల తరఫున ఓటర్లకు తాయిలాలు అందాయి. నేతలు పంపిణీ చేసిన నగదులో రూ.500, రూ.200 నోట్లు ఎక్కువగా ఉండగా, అందులో చాలావరకు నకిలీవి ఉన్నట్లు సమాచారం. కొనుగోళ్ల ద్వారా ఇవి మార్కెట్‌లోకి వస్తుండటంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గెలుపోటములపై జరుగుతున్న బెట్టింగ్స్‌లోనూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 23, 2026

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. IPS ఆఫీసర్ అరెస్ట్

image

రఘరామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. బీహార్ కేడర్‌కి చెందిన సునీల్ నాయక్ వైసీపీ హయాంలో డిప్యూటేషన్‌పై సీఐడీలో పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తిరిగి బీహార్ వెళ్లారు. గుంటూరు నగరపాలెం పీఎస్‌లో కేసు నమోదు కాగా సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నారు.

News February 23, 2026

ప.గో: ‘ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి లేదు’

image

జిల్లా వ్యాప్తంగా నేడు నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలకు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 37,550 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30కు హాజరు కావాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని హెచ్చరించారు.

News February 23, 2026

నరసాపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన డీపీటీఓ

image

నరసాపురం ఆర్టీసీ డిపోని జిల్లా నూతన ప్రజా రవాణా అధికారి (డీపీ.టీ.ఓ) సప్ప గిరిధర్ కుమార్ ఆదివారం సందర్శించారు. డిపోలోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ సత్తి సుబ్బన్న రెడ్డి,ఆఫీసు సిబ్బంది ఉన్నారు