News May 25, 2024

ప.గో: ALERT.. చలామణిలో భారీగా నకిలీ నోట్లు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో భారీగా నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఆయా పార్టీల తరఫున ఓటర్లకు తాయిలాలు అందాయి. నేతలు పంపిణీ చేసిన నగదులో రూ.500, రూ.200 నోట్లు ఎక్కువగా ఉండగా, అందులో చాలావరకు నకిలీవి ఉన్నట్లు సమాచారం. కొనుగోళ్ల ద్వారా ఇవి మార్కెట్‌లోకి వస్తుండటంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. గెలుపోటములపై జరుగుతున్న బెట్టింగ్స్‌లోనూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 10, 2025

అత్తిలి: నంది అవార్డు అందుకున్న టీచర్ 

image

అత్తిలి గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు పెద్దపల్లి వెంకటరమణికి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పురస్కారాల అకాడమీ వారు వెంకట రమణికు అవార్డును అందజేశారు. తెలుగు సాహిత్యం, కవిత్వంలో చేసిన కృషికి ఈ అవార్డు లభించినట్లు వెంకటరమణ తెలిపారు. అలాగే తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జిల్లా అధ్యక్షురాలిగా తనను ప్రకటించినట్లు తెలిపారు.

News February 10, 2025

తణుకులో సందడి చేసిన స్టార్ హీరోలు

image

తణుకులో స్టార్ హీరోలు ఆదివారం సందడి చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అత్త యలమర్తి రాజేశ్వరిదేవి ఇటీవల మృతి చెందడంతో ఆదివారం తణుకులో పెద్దకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరోలు వెంకటేష్, రానా విచ్చేశారు. ఈ సందర్భంగా అభిమానులు వారిని కలిసి ఫోటోలు తీసుకున్నారు. కొద్దిసేపు అభిమానులతో వారు ముచ్చటించారు.

News February 9, 2025

రోడ్డుప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

image

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.

error: Content is protected !!