News July 15, 2024

ప.గో: GOOD NEWS.. పోస్టాఫీసులో 114 ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. భీమవరం డివిజన్‌లో 66, ఏలూరు డివిజన్‌లో 48 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..

Similar News

News July 11, 2025

వీరవాసరంలో తిరువణ్ణామలై ఎక్స్ ప్రెస్ హాల్ట్

image

నరసాపురం నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) వీక్లి ఎక్స్ ప్రెస్ ఇక నుంచి వీరవాసరంలో కూడా హాల్ట్ ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ శుక్రవారం తెలిపారు. 2 నిమిషాల హాల్ట్‌కు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందని అయన తెలిపారు. ఈనెల 9న ప్రారంభమైన అరుణాచలం వీక్లి ఎక్స్ ప్రెస్‌లో తాను ప్రయాణించినప్పుడు వీరవాసరం‌లో కూడా హాల్ట్ ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరడం జరిగిందన్నారు.

News July 11, 2025

ప.గో: 641.544 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News July 11, 2025

భీమవరం: రైతుల అభ్యంతరాలపై జేసి ఛాంబర్‌లో విచారణ

image

జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామం రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై జేసి రాహుల్ గురువారం అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. భూసేకరణపై జూన్ 14న అభ్యంతరాలు గడువు ముగియడంతో ఆ గ్రామం నుంచి అందిన 5 మంది రైతులు అభ్యంతరాలపై నేడు విచారణ జరిగింది. మూడు అంశాలపై రైతులు అభ్యంతరాలను వ్యక్తపరచగా వీటిని ఎన్‌హెచ్ అధికారులు పరిష్కరించేందుకు రైతులకు హామీ ఇచ్చారని జేసి తెలిపారు.