News March 4, 2025

ప.గో: MLCగా గెలిచిన రాజశేఖరం నేపథ్యం ఇదే..!

image

ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన పేరాబత్తుల రాజశేఖరం స్వగ్రామం కోనసీమ జిల్లాలోని జి.వేమవరం. తొలుత ఆయన కాంగ్రెస్ ఎంపీటీసీగా, అనంతరం టీడీపీ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీగా పనిచేశారు. ఆక్వా వ్యాపారం చేసే రాజశేఖరం ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారు. B.com పూర్తిచేసిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న రాజశేఖరానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వరించింది.

Similar News

News March 5, 2025

ప.గో జిల్లా TODAY TOP HEADLINES

image

✷ పెనుగొండ: గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం ✷ సబ్సిడీ రుణాలకు లబ్ధిదారులు ఎంపిక చేయండి ✷ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల గెలుపు ✷ అంగన్వాడీ సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం ✷ నరసాపురంలో 8 కేజీల వెండి చోరీ ✷జై ఇరిగేషన్ సిస్టంతో ఉద్యానం యూనివర్సిటీ ఎంవోయూ✷ నర్సాపురం: మిస్సింగ్ అయిన మహిళ మృతి

News March 4, 2025

అంగన్వాడీల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

image

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణికి అంగన్వాడీలు వినతి పత్రాన్ని మంగళవారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 42 గంటల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. 10వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

News March 4, 2025

సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయండి: కలెక్టర్

image

ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. మార్చి 31లోపు రుణాలు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!