News July 20, 2024
ప.గో.: MPDO మిస్సింగ్.. వీడని మిస్టరీ

5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన నరసాపురం MPDO వెంకటరమణారావు ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏలూరు కాలువ వద్ద ఆయన ఫోన్ సిగ్నల్ చివరగా కట్ అవడంతో కాలువను జల్లెడపడుతున్నా.. ఇంతవరకు ఆనవాళ్లు కనిపించలేదు. ఒకవేళ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికే మృతదేహం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం 50 మంది NDRF, SDRF బృందాలు కాలువలో గాలించారు.
Similar News
News October 18, 2025
వివాహిత అదృశ్యం కేసు పై హైకోర్టు సీరియస్

తాడేపల్లిగూడెం (M) దండగర్రకు చెందిన వివాహిత మహిళ మంగాదేవి అదృశ్యం కేసు విచారణలో హైకోర్టు సీరియస్ అయింది. మహిళ తండ్రి బండారు ప్రకాశరావు 2017లో కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. వివాహిత భర్త బ్రహ్మాజీని ఐదేళ్ల తర్వాత విచారించడం పై హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు పురోగతి తెలియజేయాలంటూ పోలీసులకు ఆదేశిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
News October 17, 2025
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.
News October 17, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు 42 మంది విద్యార్థులు ఎంపిక

ఉమ్మడి ప.గో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో తణుకు ఎస్కేఎస్డీ మహిళా జూనియర్ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత నెల 12 నుంచి ఈనెల 15 వరకు అండర్-19 విభాగంలో వీరంతా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్ చిట్టూరి సత్యఉషారాణి అభినందించారు.