News June 6, 2024
ప.గో.: RRR సరికొత్త రికార్డ్

ఉండి నియోజకవర్గంలో RRR సరికొత్త రికార్డ్ సృష్టించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 10 సార్లు ఎన్నికలు జరగగా.. తొమ్మిది సార్లు గెలుపొందింది. ఒక్క 2004లోనే కాంగ్రెస్ గెలిచింది. 1978 నుంచి 1999 వరకు జె.రామచంద్రరాజు వరుసగా 6 సార్లు విజయం సాధించారు. మెజారిటీ పరంగా చూస్తే 2014లో టీడీపీ అభ్యర్థి శివరామరాజు 36231 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే తాజాగా RRR ఈ రికార్డ్ అధిగమించి 56,777 మెజార్టీ సాధించారు.
Similar News
News September 16, 2025
219 అర్జీలు సత్వరమే పరిష్కరించండి: జేసీ

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 219 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 16, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News September 15, 2025
స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-14, అండర్-17 రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. 16న చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హై స్కూల్ భీమవరం వద్ద రైఫిల్ షూటింగ్ ఎంపిక ఉంటుందన్నారు. 17న వోల్గాస్ అకాడమీలో ఆర్చరీ జట్లు ఎంపిక ఉంటుందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు.