News April 8, 2024

ప.గో.: WARNING.. అప్రమత్తంగా ఉండండి

image

ఉమ్మడి ప.గో. జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన 3 ప్రధాన నగరాలు ఉండటం గమనార్హం. భీమవరంలో 42.0, తాడేపల్లిగూడెంలో 41.0, ఏలూరులో 41.0 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లో సోమవారం వడగాల్పులకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది.
– మీ వద్ద ఎలా ఉంది..?

Similar News

News April 20, 2025

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

image

భీమవరంలోని గరగపర్రు రోడ్డులో శుక్రవారం రాత్రి ఇద్దరు బీటెక్ విద్యార్థులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించిపోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన సాగర్‌(21) తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఇజ్రాయెల్ శనివారం తెలిపారు. మరో విద్యార్థి సాయి భరత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.

News April 20, 2025

డీఎస్సీ: ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్ని పోస్టులంటే?

image

రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఉమ్మడి ప.గోలో 1035 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 49, హిందీ 48, ఇంగ్లీష్ 85, మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 42, జీవశాస్త్రం 59, సోషల్ 102, పీడీ 185, ఎస్జీటీ 417, ఎస్జీటీ ఉర్దూ 3 పోస్టులున్నాయి.

News April 20, 2025

‘డిప్యూటీ సీఎం ఫోటో మార్ఫింగ్ కేసులో వ్యక్తి అరెస్ట్’

image

మార్ఫింగ్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కించపరిచే విధంగా వాఖ్యలు చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని శనివారం భీమవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టణానికి చెందిన పత్తి హరివర్ధన్ ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సెతేరికి చెందిన చింతలపూడి పవన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అతనికి 41 నోటీసు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!