News August 16, 2024
ప.గో.: YSR ఉద్యానవర్సిటీ ఉపకులపతిగా గోపాల్

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్.కే.గోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా గోపాల్ పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది స్వాగతం పలికారు.
Similar News
News November 28, 2025
ప.గో: టీచర్‌గా మారిన కలెక్టర్ చదలవాడ

విద్యార్థుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, 10వ తరగతి విద్యార్థులతో మమేకమై ఆమె కొద్దిసేపు టీచర్‌గా మారారు. గడిచిపోయిన రోజు తిరిగి రాదని, ఎప్పటి పాఠాలు అప్పుడే చదువుకోవాలని హితవు పలికారు. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని ఆమె కోరారు.
News November 28, 2025
రైతులు అప్రమత్తంగా ఉండాలి: జేసీ

గణపవరం మండలం జల్లికొమ్మరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం కొనుగోలు, గోనె సంచుల రిజిస్టరు, ట్రక్ షీట్లను పరిశీలించారు. ట్రక్ షీట్ వెనుక భాగంలో తేమ శాతాన్ని తప్పక నమోదు చేయాలని ఆదేశించారు. ‘దిత్వా’ తుఫాన్ కారణంగా రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News November 28, 2025
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆరవెల్లి రాధాకృష్ణతో కలిసి ఆమె ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతుల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న నూతన నిర్మాణాలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఆమె వెంట ఉన్నారు.


