News June 5, 2024

ఫలించిన ‘శింగనమల’ సెంటిమెంట్.. ఉరవకొండ బద్దలు

image

రాష్ట్ర రాజీకీయాల్లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. 1978 నుంచి వస్తున్న ఈ సెంటిమెంటును టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలిచి నిరూపించారు. మరోవైపు ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటుందని.. 20 ఏళ్లగా వస్తున్న సెంటిమెంటును పయ్యావుల కేశవ్ మరోసారి గెలిచి దానిని రూపుమాపారు.

Similar News

News October 27, 2025

అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

image

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 27, 2025

రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్‌లో సత్తాచాటిన క్రీడాకారులు

image

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్‌కు అండర్-6లో 4వ స్థానం, వెనీషా‌కు బాలికల -12లో 4వ స్థానం, నితీష్‌కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.