News October 22, 2024

ఫస్ట్ డే.. హైదరాబాద్‌లో గ్రూప్-1 పరీక్షకు 87.23% హాజరు

image

తొలిరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హైదరాబాద్ జిల్లాలో 5,613 మంది అభ్యర్థులకు గానూ 4,896 మంది హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 87.23% హాజరైనట్లు అధికారులు తెలిపారు. పలుచోట్ల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా మెయిన్స్‌కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, సోమవారం 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు.

Similar News

News November 25, 2025

GHMCలోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు ఇవే!

image

☛మున్సిపాల్టీలు: పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, IDAబొల్లారం,తెల్లాపూర్, అమీన్‌పూర్
☛కార్పొరేషన్‌లు: బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్,నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట్ విలీనమవుతాయి.
ఇబ్రహీంపట్నం, కొత్తూర్, అలియాబాద్ లిస్ట్‌లో లేవు

News November 25, 2025

రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.

News November 25, 2025

రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

image

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్‌కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్‌కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.