News April 4, 2025
ఫామ్ పౌండ్ నిర్మాణంతో అభివృద్ధి: భద్రాద్రి కలెక్టర్

వ్యవసాయ భూములలో ఫామ్ పౌండ్ నిర్మించుకుంటే రైతుల ఆర్థికాభివృద్ధి తోడ్పడుతుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో పురోగతిలో ఉన్న ఉపాధి హామీ పనులపై పాల్వంచలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో గురువారం వీసీ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 6, 2025
వికారాబాద్: గ్రామాల్లో మొదలైన బేరసారాలు..!

గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అయితే రెండో విడతలో ఈరోజు విత్ డ్రా ఉండడంతో గ్రామాలలో బేర సారాలు గట్టిగానే నడుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే విందులు వినోదాలు ఉత్సాహపరుస్తున్నారు. బేరసారాలు మాత్రం లక్షల్లో పలుకుతున్నట్లు సమాచారం. ఉప సర్పంచు పదవి ఆశిస్తున్న వారు తమ వార్డులో ప్రత్యర్థిగా నామినేషన్ వారితో సెటిల్మెంట్ ఆఫర్లు ఇస్తున్నారట. ఈరోజు ఎన్ని విత్ డ్రా లు అయితాయో చూడాలి.
News December 6, 2025
HYD: పురపాలికల విలీనంతో “చెత్త” సమస్యలు!

జీహెచ్ఎంసీలో 27 పురపాలిక సంస్థలు విలీనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెత్త నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే ఉన్న అధికారులు వీటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇంత మంది అధికారులు ఉన్నా సరే పాత జీహెచ్ఎంసీలో చెత్త నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండేది. కొత్త ప్రాంతాలు రావడంతో ఇక పరిస్థితి ఎలా ఉంటుందని గుబులు మొదలైంది. వీటి కోసం కొత్త వారిని నియమిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు.
News December 6, 2025
జగిత్యాల: స్థానిక ఎన్నికలు.. జోరుగా దావత్లు

జగిత్యాల జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దావతులు జోరుగా సాగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పురుష ఓటర్లకు ప్రత్యేకంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు. వారితో కలిసి ప్రచారం చేసినవారికి రాత్రి కాగానే మందు, మాంసంతో పార్టీలు ఇస్తున్నారు. సంఘాలు, యూత్లు, వార్డుల వారీగా గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తూ వారి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.


