News March 22, 2025
ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
Similar News
News April 13, 2026
రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2026
నేడు కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News April 11, 2026
‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’గా కళ్యాణి రాధా

అనంతపురం జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కళ్యాణి రాధా ‘బెస్ట్ మహిళా ఇంజినీరింగ్ ప్రొఫెసర్’ అవార్డు అందుకున్నారు. శుక్రవారం టెక్కలిలో జరిగిన ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె మెకానికల్ విభాగాధిపతిగా, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.


