News April 18, 2024
ఫారం-12 సేకరణ కేంద్రం ఏర్పాటు: జేసీ

ఎన్నికల విధులు నిర్వహించే ఓపిఓ , మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు రాజమహేంద్రవరం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో ఫారం 12 సేకరణ కేంద్రం ఏర్పాటు చేసామని టర్నింగ్ అధికారి, జెసి తేజ్ భరత్ తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు పోస్టల్ బ్యాలెట్ సేకరణ కేంద్రంలో ఫారం-12, ఎన్నికల విధుల ఉత్తర్వు పత్రం, ఆధార్, గుర్తింపు కార్డు అందించాలన్నారు.
Similar News
News December 4, 2025
ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
News December 4, 2025
కోరుకొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం-కనుపూరు రోడ్డులో గంజాయి చేతులు మారుతుండగా దాడి చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడిన ఆరుగురిని అరెస్టు చేశారు. స్విఫ్ట్ కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
News December 4, 2025
ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్‌స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, సీతానగరం, రాజానగరం, కడియం పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.


