News April 10, 2024
ఫారెస్ట్ బీట్ అధికారిపై దాడి..

ములకలపల్లి మండల పరిధిలోని గుండాలపాడు పంచాయతీ చలమన్న నగర్‌లో ఫారెస్ట్ బీట్ అధికారిపై దాడి జరిగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పోడుభూములకు ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నారని సమాచారం మేరకు బీట్ అధికారి వెంకన్న అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న 15 మంది అతనిపై ముకుమ్మడి దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 17, 2026
ఖమ్మం: డీవైఎస్ఓ సునీల్ రెడ్డికి అదనపు బాధ్యతలు

పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జ్ మేనేజర్ గా తుంబూరు సునీల్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ స్థానంలో ఉన్న శ్రీలత ఇటీవల హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. అయితే, ఆమె స్థానాన ఎవరినీ నియమించకపోవడంతో డీవైఎస్ఓగా ఉన్న సునీల్ రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యాన సజావుగా పర్యవేక్షణ కోసం ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
News April 17, 2026
ఖమ్మం: పల్టీ కొట్టిన వరి కోత మిషన్.. డ్రైవర్ మృతి

కల్లూరు మండలం పెద్ద కోరుకొండి శివారులో వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెప్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 17, 2026
ఖమ్మం: ‘డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నగారా’

డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ (DOST) తొలిదశ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. మే 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉందని, ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి కళాశాల హెల్ప్‌లైన్ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.


