News April 7, 2025

ఫార్మసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా షేక్ యూనస్

image

ఫార్మసి సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా షేక్ యూనస్‌ను నియమిస్తూ రాష్ట్ర ఫార్మసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేశ్ బాబు ఉత్తర్వులు అందజేశారు. ఫార్మసీ చట్టం ప్రకారం ప్రతి మందుల షాపులలో ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. 1948 సెక్షన్ 19 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకొకసారి ఎలక్షన్స్ జరిపించాలని తెలిపారు.

Similar News

News November 18, 2025

రాజమండ్రి: నారా లోకేశ్ పర్యటన వాయిదా.. కారణం ఇదే

image

నవంబర్ 20న రాజమహేంద్రవరం సిటీలో జరగాల్సిన రాష్ట్ర ఐటీ,విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు నగర టీడీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 20వ తేదీన నితీష్‌కుమార్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి లోకేశ్ కూడా హాజరుకానున్నారు. అందువలనే పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.

ఈ ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్: ఎస్పీ

image

మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 లు ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న దహనం చేయడం జరిగిందన్నారు.