News February 2, 2025

ఫార్మా ఉద్యోగి గాజువాకలో సూసైడ్

image

ఫార్మాసిటీలో పనిచేస్తున్న విజయనగరం యువకుడు గాజువాకలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కరరావు గాజువాకలో అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బంధువులు దాడి చేసి ఇంట్లో బంధించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాజువాక పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News February 23, 2026

చిలకలూరిపేట రైల్వే లైన్ కోసం వినతి

image

పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన చిలకలూరిపేటకు రైల్వే కనెక్టివిటీ లేకపోవడం పెద్ద లోటుగా ఉందని స్థానిక రైల్వే సాధన సమితి పేర్కొంది. శావల్యాపురం నుంచి చిలకలూరిపేట మీదుగా బాపట్లకు నూతన రైల్వే లైన్ నిర్మించాలని సమితి సభ్యులు ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పుల్లారావులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ కృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే మంత్రికి వినతిపత్రం అందజేసిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కోరారు.

News February 23, 2026

విశాఖ: ట్రైన్‌లో బంగారం ఉన్న బ్యాగ్ చోరీ

image

విశాఖ నుంచి ఆగ్రాకు వెళ్తున్న మహిళ బ్యాగ్ రైల్వే స్టేషన్లో మిస్ అయింది. బ్యాగ్‌లో 200 గ్రాముల బంగారం, రూ.12,500 ఉన్నట్టు ఆమె సీపీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించి హర్యానాకు చెందిన వ్యక్తి బ్యాగును దొంగలించి ట్రైన్‌లో వెళ్లిపోయినట్టు గమనించారు. ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి బ్యాగు స్వాధీనం చేసుకున్నారు.

News February 23, 2026

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

అనంతపురం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తికి ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు. సత్యసాయి జిల్లాలో 42 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.