News March 17, 2025
ఫాస్ట్గా ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్

ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 10నుంచి అధికారులు పేపర్లు దిద్దుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అన్ని పేపర్లను కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజీలోనే వాల్యుయేషన్ చేస్తున్నారు. కాగా ప్రతీ గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు నాటికి ప్రాసెస్ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.
Similar News
News December 6, 2025
మూడో విడతలో 27,277 నామినేషన్లు

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతలో 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. 36,442 వార్డు స్థానాలకు 89,603 మంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 1,192 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. ఉపసంహరణకు గడువు ఈ నెల 9 వరకు ఉంది. మూడో విడత ఎన్నికలు 17న జరగనున్నాయి.
News December 6, 2025
జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుశిక్ష తప్పదు

వృద్ధ తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యత అని, నిర్లక్ష్యం చేస్తే జైలు, జరిమానా తప్పవని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ హెచ్చరించారు. ఆర్డీవో ఛాంబర్లో గుల్లపేట, మల్లన్నపేట్, అల్లీపూర్, పూడూర్ గ్రామాల వృద్ధుల నిరాధారణ కేసులను విచారించారు. వయోవృద్ధుల తరఫున సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వాధించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికాంత్, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<


