News January 31, 2025
ఫిబ్రవరిలోపు పనులు పూర్తి కావాలి: తిరుపతి కలెక్టర్

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులలో పురోగతి ఉండాలని, ఎలాంటి అలసత్యం వహించరాదని తిరుపతి కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కల్లెక్టరేట్ నుంచి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News December 4, 2025
తిరుపతి: డ్రంక్ అండ్ డ్రైవ్.. భారీ జరిమానా

తిరుపతి పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 31 మంది డ్రైవర్లకు 3వ అదనపు మేజిస్ట్రేట్ సంధ్యారాణి బుధవారం రూ.3,10,000 జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ DSP రామకృష్ణ చారి తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 25 మందికి రూ.500 చొప్పున రూ.12,500 జరిమానా విధించినట్లు తెలిపారు.
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <
News December 4, 2025
రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలలు: MP

రాష్ట్రంలో 134 బోధనా ప్రయోగశాలల ఏర్పాటు కేంద్ర పరిశీలనలో ఉందని కాకినాడ MP తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం పార్లమెంటులో తానడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా వీటి ఏర్పాటు పరిశీలిస్తున్నారన్నారు. తిరుపతి ఐఐటీకి రూ.25.28 కోట్లు ఇప్పటికే మంజూరైనట్లు మంత్రి తెలిపారని ఎంపీ వెల్లడించారు.


