News January 31, 2025
ఫిబ్రవరిలోపు పనులు పూర్తి కావాలి: తిరుపతి కలెక్టర్

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులలో పురోగతి ఉండాలని, ఎలాంటి అలసత్యం వహించరాదని తిరుపతి కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కల్లెక్టరేట్ నుంచి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News February 12, 2025
తిరుపతి: ఆమరణ నిరాహారదీక్షలో ప్రత్యేకంగా పోస్టర్

టీటీడీ పరిపాలన భవనం ఎదుట స్వాముల తిరుపతిలో ముంతాజ్ హోటల్ వద్దంటూ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షలో ఓ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది. స్వాములు దీక్ష చేస్తున్న ప్రాంతంలో సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నిస్తున్నట్లు పోస్టర్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిని రోడ్డుపై వెళ్లే వారు సైతం ఆగి చూసి మరీ వెళ్తున్నారు.
News February 12, 2025
ఇజ్రాయెల్ రాయబారిని కలిసిన బాపట్ల MP

భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీరువాన్ అజార్‌ని బుధవారం బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల పార్లమెంటరి నియోజకవర్గం గురించి ఎంపీ వివరించారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, జల వనరులు, వ్యాపార అవకాశాలు తదితర అంశాలు గురించి అజార్‌తో ఎంపీ చర్చించారు.
News February 12, 2025
HYDలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు..!

HYD,SECలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు indiapostgdsonline.gov.inవెబ్‌సైట్లో తపాలాశాఖ నోటిఫికేషన్ విడుదలైంది. HYD SORTING- డాక్ సేవక్ 27, HYD సౌత్ ఈస్ట్-డాక్ 22, GDS 19, HYD సిటీ- డాక్‌సేవక్ -7, సికింద్రాబాద్-డాక్‌సేవక్ 12, GDS-12 ఉన్నాయి. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40 మధ్య ఉండాలి. సైకిల్,బైక్ నడపగలగాలి. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100, మిగిలిన వారికి ఉచితం.