News February 5, 2025
ఫిబ్రవరి మొదటి వారంలోనే పెరిగిన ఉష్ణోగ్రత!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని గ్రామాలలో చలి తీవ్రత తగ్గుతూ.. ఎండ తీవ్రత పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లాలో 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే భానుడి ప్రతాపం ఈ విధంగా ఉంటే రానున్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 8, 2025
9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.
News December 8, 2025
జగ్గయ్యపేట: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

రెండు రోజుల క్రితం జగ్గయ్యపేటలో కలకలం సృష్టించిన హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాయిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో సాయి పోలీసులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ చేపట్టారు.
News December 8, 2025
సాలూరు: విహారయాత్రకు వెళ్లి ఒకరి మృతి

సాలూరు (M) దళాయివలస జలపాతం వద్ద ఆదివారం ఒకరు మృతి చెందారు. రామభద్రపురానికి చెందిన హరి స్నేహితులతో కలిసి విహారయాత్రకు జలపాతానికి వెళ్లాడు. జలపాతం దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి ఊబిలో కురుకుపోవడంతో స్థానికుల సహకరంతో హరిని బయటకు తీసి సాలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


