News January 27, 2025

ఫిబ్రవరి మొదటి వారంలో గృహప్రవేశాలకు సిద్ధం చేయండి

image

జిల్లాలో గృహ నిర్మాణాలు నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చెయాలని , ఫిబ్రవరి మొదటి వారంలో గృహ ప్రవేశాలను ప్రజాప్రతినిధులు సమక్షంలో వేడుకగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం గృహ నిర్మాణాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు చేపట్టనున్న దృష్ట్యా పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేలా సిద్ధంగా ఉంచాలన్నారు.

Similar News

News February 18, 2025

కొవ్వూరు: దళితుల వ్యతిరేకని జగన్ మరొకసారి నిరూపించుకున్నారు

image

జగన్ దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కే.ఎస్ జవహర్ అన్నారు. మంగళవారం కొవ్వూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ..దళిత బాధితులను పరామర్శించడానికి రాని జగన్ ఇప్పుడు, నేరస్థుడుకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. దళిత యువకుడిని బాధించిన నేరస్థుడు వల్లభనేని వంశీతో జగన్ ములాఖత్ హేయమైన చర్య అన్నారు. జగన్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.

News February 18, 2025

విభజన చట్టం పై చర్చకు పవన్ చొరవ చూపాలి: ఉండవల్లి

image

ఆంధ్రప్రదేశ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేసి నేటికీ 11 సంవత్సరాలకుగాను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్రధారిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో విభజన చట్టంపై చర్చించేందుకు కేంద్రానికి నోటీసు ఇచ్చేలా చూడాలని ఉండవల్లి కోరారు. 

News February 18, 2025

కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. భార్య కుమారితో కలిసి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైకుపై తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బైకుపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. 

error: Content is protected !!