News December 31, 2024

ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు: మంత్రి అనగాని

image

రాష్ట్రంలో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. లక్ష 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు సవరిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తమన్నారు.

Similar News

News December 8, 2025

GNT: అత్యవసర సమయంలో సంజీవిని LOC..!

image

పేదలకు వైద్య సహాయం కోసం CMRF, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలు ఉపయోగపడుతుంటాయని తెలిసిందే. ఇవి కాక అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) అనే పథకం సంజీవినిలా పని చేస్తుందని చాలా మందికి తెలీదు. బ్రెయిన్ స్ట్రోక్, గుండె పోటు, కిడ్నీ ఫెయిల్యూర్, నవజాత శిశువుల అనారోగ్యం వంటి వాటికి అత్యవసర చికిత్స కోసం ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే బాధితులకు ఈ సాయం అందుతుంది.

News December 8, 2025

PGRS అర్జీల స్థితిని 1100 ద్వారా తెలుసుకోవచ్చు: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో సమర్పించిన అర్జీల స్థితిని టోల్ ఫ్రీ 1100 ద్వారా తెలుసుకోవచ్చని గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్‌సైట్‌లో లేదా నేరుగా కూడా అందించవచ్చని సూచించారు. కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.