News January 20, 2025
ఫిబ్రవరి 2 నుంచి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సిరికొండ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 2న NLG పట్టణ పురవీధులలో నగరోత్సవం, ఫిబ్రవరి 4న స్వామివారి కల్యాణోత్సవం, ఈనెల 7న తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News February 14, 2025
ఖండాలు దాటిన ప్రేమ.. నల్గొండ అబ్బాయి.. అమెరికా అమ్మాయి

ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్‌గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్‌లో వీరి వివాహ జరిగింది.
News February 14, 2025
ఎమ్మెల్యే వేముల వీరేశం LOVE STORY మీకు తెలుసా..?

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. నకిరేకల్ MLA వీరేశం, పుష్ప దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విప్లవ, ప్రగతిశీల ఉద్యమంలో పనిచేసే సమయంలో ఇద్దరి జీవిత లక్ష్యం ఒక్కటే కావడంతో కలిసి బతకాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కమ్యునిస్టు భావజాలం కలిగినవి కావడంతో పెద్దల అంగీకారంతో ఆనాడు వారు పనిచేస్తున్న ఉద్యమ సంస్థే వీరి పెళ్లి జరిపించింది.
News February 14, 2025
లెక్క తేలింది.. ప్రచారం షురూ కానుంది

WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైన నామినేషన్లతో పాటు ఉపసంహరణల ఘట్టాలు పూర్తయ్యాయి. ఇక ప్రచారం జోరుగా సాగనున్నట్లు తెలుస్తోంది. బరిలో ఉండేవారు తేలడంతో నేటి నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ప్రధాన సంఘాల అభ్యర్థులు కొందరు ఇప్పటికే రెండు మూడు దఫాలుగా జిల్లాలను చుట్టేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీన జరగనున్నది.