News January 30, 2025

ఫిబ్రవరి 3న జోగులాంబ మూలవిరాట్ నిజరూప దర్శనం

image

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు శ్రీ జోగులాంబ అమ్మవారు మూలమూర్తి విగ్రహం నిజరూపంలో దర్శనమిస్తుంది. వచ్చే వసంత పంచమి ఫిబ్రవరి మూడో తేదీ సహస్ర గట్టాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుందని దేవస్థానం ఈవో పురందర కుమార్ తెలిపారు.

Similar News

News November 1, 2025

తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

image

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.

News November 1, 2025

సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కుంగ్ ఫు, జోడో, కలర్ కలరిపయట్టు నేర్పించే ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఎంపికైన వారు విద్యార్థులకు కరాటే నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News November 1, 2025

JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <>jeemain.nta.ac.in<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. JEE మెయిన్ రెండు సెషన్లలో జరగనుంది. ఫస్ట్ సెషన్ జనవరి 21, 30 తేదీల మధ్య, రెండో సెషన్ ఏప్రిల్ 1, 10 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. బీఈ, బీటెక్, B. Arch, B. Planning కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.