News January 28, 2025
ఫిబ్రవరి 3న సిక్కోలుకు సింగర్ మంగ్లీ

అరసవల్లి రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ, జాతీయస్థాయి సంగీత కళాకారులు, నర్తకులు ఈ వేడుకలకు రానున్నారు.
Similar News
News February 13, 2025
SKLM: గుండెపోటు.. రూ. 45 వేల ఇంజెక్షన్ ఉచితం

గుండెపోటు వచ్చే సమయాల్లో మొదటి గంట కీలకమని జిల్లా DCHS డాక్టర్ కళ్యాణ్ బాబు తెలిపారు. గోల్డెన్ అవర్‌లో రోగికి ఇచ్చే టెనెక్టివ్ ప్లస్ ఇంజెక్షన్ జిల్లాలో 15 చోట్ల అందుబాటులో ఉందన్నారు. రూ.45వేల విలువైన ఈ ఇంజెక్షన్ ఫ్రీగా అందించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రితో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, బారువ, మందస, కవిటి, హరిపురం, కోటబొమ్మాళి, పాతపట్నం, బుడితి, రణస్థలం, ఆమదాలవలసలలో ఉంది.
News February 13, 2025
శ్రీకాకుళంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు: రాజగోపాలరావు

నేటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కె.రాజగోపాలరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందలేదని అన్నారు. జిల్లాలోని ప్రతి కోళ్ల ఫారంలు తనిఖీ చేయడానికి 68 రాపిడ్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. కోళ్ల పెంపకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
పాతపట్నం: లారీ ఢీకొని బాలిక దుర్మరణం

లారీ ఢీకొని బాలిక మృతి చెందిన ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతపట్నంకు చెందిన శ్రీనివాస్ HYDకు వలస వచ్చి చైతన్య బస్తీలో ఉంటున్నారు. వారి కుమార్తె మమత(17). ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేది. మంగళవారం రాత్రి స్నేహితుడితో కలిసి మూసాపేట్ Y జంక్షన్ వద్దకు రాగానే స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.