News January 31, 2025
ఫిబ్రవరి 5న అనంత హార్టికల్చర్ కాంక్లేవ్: కలెక్టర్

ఫిబ్రవరి 5న ‘అనంత హార్టికల్చర్ కాంక్లేవ్’ కార్యక్రమం నిర్వహించనున్నామని, ఇందుకు అన్ని విధాలా సిద్ధం కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అనంత హార్టికల్చర్ కాంక్లేవ్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 20, 2025
అనంతపురం కలెక్టర్‌కు పలు ప్రతిపాదనలు

నగరీకరణలో నవీకరణను జోడించి అహుడ అభివృద్ధికి కలిసి పని చేద్దామని అనంతపురం- హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ టీసీ వరుణ్ అన్నారు. బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్‌ను కలెక్టరేట్లో కలిసి అహుడ అభివృద్ధి కోసం రూపొందించిన పలు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అహుడా అభివృద్ధి విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది.
News February 19, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ సెక్టార్‌పై జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన గ్రీవెన్స్ ఎలాంటి పెండింగ్ ఉంచడానికి వీలు లేదన్నారు.
News February 19, 2025
యూట్యూబర్ హత్య.. భూ వివాదమే కారణమా?

గుంతకల్లు మండలంలో యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కసాపురం హంద్రీనీవా కాలవలో మంగళవారం శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఆయన హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.