News February 1, 2025
ఫిబ్రవరి 5న కలెక్టరేట్ వద్ద ధర్నా: అమర్నాథ్

జిల్లాలో ఐదో తేదీ నుంచి వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News February 25, 2026
ఏపీ మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ టెక్నాలజీ సెంటర్?

విశాఖలోని A.P మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జర్మన్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం పర్యాటనలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. మెడ్‌టెక్ రంగంలో సంయుక్త పరిశోధన, ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఇదే రోజున రోబోటిక్స్ సంస్థ Cogmac Technologies మెడిటెక్ జోన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
News February 25, 2026
రాజాంలో పద్మం సిల్వర్ జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్

పద్మం సిల్వర్ జువెలరీ బ్రాంచ్‌ను రాజాంలోని పాలకొండ రోడ్డులో గల CMRలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను టీడీపీ నాయకుడు కొండ్రు జగదీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న ఆభరణాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను పెట్టారు. సిల్వర్ జువెలరీకి కూడా మార్కెంట్‌లో డిమాండ్ పెరిగిందని CMR గ్రూపుల అధినేత మావూరి వెంకట రమణ పేర్కొన్నారు.
News February 25, 2026
విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.


