News December 31, 2024
ఫిర్యాదుదారులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం: ఎస్పీ
ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి తగు సమయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 19 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News January 7, 2025
JNTUA పరీక్షా ఫలితాలు విడుదల
అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్లో నిర్వహించిన MBA 3, 4 సెమిస్టర్లు, MCA 3, 4, 5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
News January 7, 2025
‘అనంతపురం జిల్లాలో హెచ్ఎంపీవీ కేసులు లేవు’
చైనాలో గుర్తించిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. న్యూమో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.
News January 6, 2025
కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు
కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.