News December 31, 2024

ఫిర్యాదుదారులకు న్యాయం జరిగే విధంగా చూస్తాం: ఎస్పీ

image

ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి తగు సమయంలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 19 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో చట్టప్రకారం విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 20, 2025

వయోపరిమితిపై సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు: ఎస్పీ

image

పోలీస్ దేహదారుఢ్య పరీక్ష అభ్యర్థులకు వయోపరిమితిపై జీవో 155 ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ కోరారు. వయో పరిమితి ఉన్నా అనుమతించడం లేదంటూ మీడియాలో ప్రచురితమైన వార్తలో నిజం లేదన్నారు. 2022 నవంబర్ 28న ఏపీ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనించాలన్నారు.

News January 20, 2025

బలమైన శక్తిగా వైసీపీ యువజన విభాగం: వైసీపీ జిల్లా అధ్యక్షుడు

image

వైసీపీ అనుబంధంగా యువజన విభాగం బలమైన శక్తిగా తయారు కావాలని వైసీపీ అనంతపురము జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే నాయకత్వం బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఆదివారం కోర్టు రోడ్డులోని క్యాంప్‌ కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం అనంతపురము జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అనంతపురం నగర పరిధిలోని యువజన విభాగం నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

News January 19, 2025

కదిరి నరసింహ సామి సాచ్చిగా..

image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ‘VT 15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.