News April 13, 2025

ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలి:SP

image

ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ గస్తీ నిర్వహించాలన్నారు.

Similar News

News November 13, 2025

నవంబర్ 13: చరిత్రలో ఈరోజు

image

1780: సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం
1920: గణిత శాస్త్రవేత్త కె.జి.రామనాథన్ జననం
1925: నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం
1935: సినీ గాయకురాలు పి.సుశీల జననం (ఫొటోలో లెఫ్ట్)
1973: స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం
2002: కవి కాళోజీ నారాయణరావు మరణం (ఫొటోలో రైట్)
2010: సినీ నిర్మాత డి.వి.యస్.రాజు మరణం

News November 13, 2025

దానవాయిగూడెం గురుకులంను మోడల్‌గా మారుస్తాం: పొంగులేటి

image

దానవాయిగూడెం టీ.జీ.ఎస్.డబ్ల్యు.ఆర్ బాలికల గురుకులాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పాఠశాల, కళాశాల భవన మరమ్మతులకు రూ.3.80 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భవన మరమ్మతులు, కాంపౌండ్ వాల్, సీసీ రోడ్లు, క్రీడా మౌలిక వసతుల పనులకు మంత్రి కలెక్టర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, అధికారులు పాల్గొన్నారు.

News November 13, 2025

నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదు: ADB కలెక్టర్

image

విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాల కోసం అవసరమైన మీసేవ ధ్రువపత్రాలు పొందడానికి ఇకపై నోటరైజ్డ్ అఫిడవిట్ అవసరం లేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో నోటరైజ్డ్ అఫిడవిట్ అడగడం వల్ల పేద ప్రజలకు అదనపు ధన వ్యయం, సమయ నష్టం జరుగుతున్నదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై అలాంటి అఫిడవిట్‌లు లేదా గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరణ సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.