News March 21, 2024
ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 0863-2234301 నంబరుకు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని పేర్కొన్నారు.
Similar News
News October 25, 2025
గుంటూరు జిల్లాలో స్కూళ్లకు 3 రోజులు సెలవులు

మెంథా తుపాన్ దృష్ట్యా 27, 28,29 తేదీల్లో పాఠశాలలకు కలెక్టర్ తమీమ్ అన్సారియా సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులు చిన్నారులను బయటకు పంపొద్దన్నారు. ప్రజలు తుపాన్ దృష్ట్యా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 0863 2234014 ఏర్పాటు చేశామని దీంతోపాటు డివిజన్ మండల స్థాయిలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
News October 25, 2025
సెస్సు బకాయిలపై దృష్టి సారించాలి: జేసీ

గ్రంథాలయ సెస్సు బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గ్రంథాలయ సెస్సు సమీక్షా సమావేశం శనివారం కలెక్టరేట్లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రంథాలయ సంస్థ సెస్సు బకాయిలు రూ. 64, 36,14,822లు ఉన్నాయని చెప్పారు. సెస్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలని జేసీ ఆదేశించారు.
News October 25, 2025
పోలీస్ ప్రతిష్ఠను కాపాడండి: ఎస్పీ

పోలీస్ ప్రతిష్ఠ, గౌరవం, అధికారాన్ని కాపాడే విధంగా సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శనివారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ లాఠీ, విజిల్ తమతో ఉంచుకోవాలని, అవసరమైతే వాటిని చట్టబద్ధంగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు.


