News July 16, 2024
ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి: ఏలూరు కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Similar News
News October 11, 2024
ఉమ్మడి ప.గో జిల్లాలో 8,770 టెండర్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. మొత్తం జిల్లాలో 175 దుకాణాలకు గాను ఇప్పటికి 4495 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సుమారు రూ.90 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు 4275 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News October 11, 2024
ఏలూరు జిల్లాలో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400
ఏలూరు జిల్లాలోని కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా..వాటికి వెల్లుల్లి తోడవ్వడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ. 400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లి కూడా చేర్చాలంటున్నారు.
News October 10, 2024
ఉచిత ఇసుకతో భారీ దోపిడి: కారుమూరి
నిత్యవసరాలు సామాన్యులకు అందకుండా నియంత్రించలేని కూటమి ప్రభుత్వం సూపర్ బాదుడు కొనసాగిస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. తణుకు సజ్జాపురంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుక పేరుతో భారీ ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. వరద నియంత్రణ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.