News January 6, 2025
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
Similar News
News October 30, 2025
మిర్యాలగూడ: చివరి ధాన్యం గింజ వరకూ కొంటా: కలెక్టర్

ఈ ఖరీఫ్‌లో రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. గురువారం రైస్ మిల్లు తనిఖీ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని తెలిపారు. రైస్ మిల్లర్లు ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని దించుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆమె అన్నారు.
News October 30, 2025
ధాన్యం తడవకుండా పటిష్ఠ చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

మాడుగులపల్లి: మొంథా తుపాను నేపథ్యంలో వర్షాలకు ధాన్యం తడవకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జులను ఆదేశించారు. గురువారం ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి ఆమె మాడుగులపల్లి మండలం చిరుమర్తిలోని ఐకేపీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులతో సమన్వయం చేసుకొని, టార్పాలిన్లు, లారీలు సిద్ధం చేయాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డికి సూచించారు.
News October 30, 2025
NLG: ధాన్యం తడవడంతో సెంటర్ ఇన్ఛార్జికి షోకాజ్

తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల తుఫాను వర్షాలకు కేంద్రంలోని ధాన్యం తడవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సెంటర్ ఇన్ఛార్జికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆమె ఆదేశించారు.


