News February 3, 2025
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ
ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.
Similar News
News February 4, 2025
నేడు కడపకు వస్తున్న ఇంఛార్జి మంత్రి సవిత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సావిత్రమ్మ నేడు కడపకు వస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
News February 3, 2025
గజ వాహనంపై భక్తులకు కడప రాయుడి దర్శనం
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని గజవాహనంపై అలంకరించి నాలుగు మాడవీధుల్లో విహారం చేశారు. నేడు స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు రథంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
News February 3, 2025
కడప: YVU పీజీ పరీక్షా ఫలితాలు విడుదల
వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.