News February 3, 2025
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ

ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే విచారించి పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ తగిన సమయంలో విచారించి న్యాయం చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
అవినీతి ఆరోపణలపై కడప కార్పొరేషన్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత

కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ విభాగంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ముగ్గురు రిటైడ్ ఇంజినీర్ల పెన్షన్లలో కోత విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB ఫిర్యాదుపై విచారణ జరిపిన ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు శ్రీనివాసులు, దస్తగిరి రెడ్డి, దౌలాకు వారి పెన్షన్లో 5 శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పనులను విభజించి, నామినేషన్‌పై కట్టబెట్టడంపై చర్యలు తీసుకున్నారు.
News March 17, 2026
జిల్లాలో పలువురు డిప్యూటీ ఎమ్మార్వోలకు తాత్కాలిక పదోన్నతులు

కడప జిల్లాలో పలువురు డిప్యూటీ ఎమ్మార్వోలకు తాత్కాలిక పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తూ సోమవారం కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. వారి పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
➤ శివలక్ష్మి – నందలూరు, ➤ విజయకుమారి – చెన్నూరు
➤ లక్ష్మీనారాయణ – కడప అర్బన్, ➤ లక్ష్మమ్మ – టి సుండుపల్లె
➤ షఫీ – మైలవరం, మనోజ్ – బి.కోడూరుకు తహసీల్దార్లుగా బదిలీ పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.
News March 16, 2026
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా రికార్డు

జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో కడప జిల్లా అద్భుతమైన పనితీరు కనబరిచి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 1,03,591 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల పరిష్కారంతో కక్షిదారులకు రూ.24.01 కోట్ల చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నారు. సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం, న్యాయవ్యవస్థ సఫలీకృతం అయ్యాయన్నారు.


