News April 1, 2025
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి: ఎస్పీ

జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్, లాకప్, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డికి పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరమే స్పందించి సేవలు అందించాలని అన్నారు.
Similar News
News April 22, 2025
నారాయణపేట: బాలికపై యువకుడి అత్యాచారం

NRPT జిల్లా మద్దూరులో బాలికపై అత్యాచారం జరిగింది. కోస్గి సీఐ సైదులు తెలిపిన వివరాలు.. దామరగిద్ద మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) మద్దూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. దామరగిద్ద వాసి బోయిని శ్రీనివాస్(24) ఈనెల 10న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై HYDకు తీసుకెళ్లి ఓ కిరాయి రూంలో అత్యాచారం చేసి, తెల్లారి మద్దూరు బస్టాండ్‌లో వదిలేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 22, 2025
రెండు బైకులు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి.ఈ ఘటన సోమవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలుకావడంతో తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబీకులు వెల్లడించారు.
News April 22, 2025
శ్రీకాకుళం: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

శ్రీకాకుళం జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?