News March 22, 2024

ఫిర్యాదుల ప‌రిష్కార నాణ్య‌త‌పై దృష్టిసారించాలి: కలెక్టర్

image

ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. సీ-విజిల్‌, 1950 హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ), క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూం నెంబ‌ర్ (0866-2570051) త‌దిత‌రాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను నాణ్య‌త‌తో, స‌త్వ‌ర ప‌రిష్కారంపై దృష్టిసారించాల‌ని అధికారులకు సూచించారు.

Similar News

News November 16, 2025

కృష్ణా జిల్లాలో ‘దాళ్వా’ సాగుపై సందిగ్ధత.!

image

కృష్ణా జిల్లాలో దాళ్వా సాగుపై సందిగ్ధత నెలకొంది. రెండవ పంటగా దాళ్వాకు సాగునీరు ఇవ్వాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కానీ జలాశయాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల దాళ్వాకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దాళ్వాకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం లోపాయికారిగా రైతులకు ఇదే చెబుతుండటం విశేషం.

News November 15, 2025

కృష్ణా: పంట ఎంపికలో చిక్కుకున్న రైతన్నలు

image

ఖరీఫ్ సీజన్ ముగిసిన తరువాత రెండో పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్నా ప్రభుత్వం నుంచి రబీ సీజన్‌పై స్పష్టత లేకపోవడంతో రైతులు గందరగోళంలో ఉన్నారు. రబీని అధికారికంగా ప్రకటిస్తే వరి వంగడాలు కొనుగోలు చేయాలా? లేక అపరాల వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించాలా? అనే సందిగ్ధంలో పడ్డారు. పొలం అదును పోయే పరిస్థితి వస్తే అపరాల పంటలకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని, సాగు ఖర్చులు రెట్టింపు అవుతాయని అంటున్నారు.

News November 15, 2025

మచిలీపట్నం GGHలో అవినీతి మరకలు..?

image

మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రి అవినీతికి అడ్డాగా మారుతోందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇదేకాక శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థుల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో కూడా కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలు సర్వత్రా విమర్శలకు దారితీస్తున్నాయి.